Friday, March 29, 2024
- Advertisement -

నెపోటిజం పై రియాక్ట్ అయిన రానా దగ్గుబాటి

- Advertisement -

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ రానా దగ్గుబాటి తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒక నటుడిగా విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్తున్న రానా తాజాగా నెపోటిజం పైన నోరు విప్పారు. “ఇండియాలో ఏ ఫిలిమ్ స్కూలు గొప్ప ఫిల్మ్ మేకర్ లను తయారు చేయటం లేదు. మేము మా టాలెంట్ వల్లనే గొప్ప ఫిల్మ్ మేకర్ లు అయ్యాము. ఆ టాలెంట్ మేము నేర్చుకొని ఉండొచ్చు లేదా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు” అని అన్న రానా ఒక వ్యక్తిపై నెపోటిజం ప్రొడక్ట్ అని ముద్ర వేయడం చాలా తప్పు అని అన్నారు.

“మీ నాన్నగారు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు అయితే మీకు ఆ ఇండస్ట్రీ గురించి లోని ప్రతి విషయం గురించి అవగాహన వస్తుంది. మా నాన్నగారు ఒక నిర్మాత. మా అమ్మ ఫిల్మ్ లేబరేటరీ ని నడిపేవారు. మా బాబాయి ఒక నటుడు. కాబట్టి నాకు సినిమా ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. నాకే కాదు అందరు స్టార్ కిడ్స్ కి అలానే సినిమా ప్రాసెస్ గురించి తెలుస్తుంది. కానీ దాన్ని అనుభవం అని కాకుండా నెపోటిజం అని ఎందుకు పరిగణిస్తారు?” అంటూ ప్రశ్నించాడు రానా. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సులువు కావచ్చు కానీ ఆ తర్వాత వాళ్లు వాళ్ల కష్టం వలనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, ఫ్యామిలి వల్ల వచ్చినా లేక కాలేజ్ వల్ల వచ్చినా టాలెంట్ టాలెంటే అని చెప్పుకొచ్చారు రానా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -