Thursday, April 25, 2024
- Advertisement -

రణరంగం రివ్యూ

- Advertisement -

నిర్మాణం: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, సుబ్బ‌రాజు, రాజా, అజ‌య్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ త‌దిత‌రులు
ర‌చ‌న – స్క్రీన్‌ప్లే : సుధీర్ వ‌ర్మ‌
సంగీతం: ప్ర‌శాంత్ పిళ్లై
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ద‌ర్శ‌క‌త్వం: సుధీర్ వ‌ర్మ‌
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
విడుద‌ల‌: ఆగ‌స్ట్ 15, 2019
నిడివి: 138 నిమిషాలు

కథ: సరదాగా బ్లాక్ టికెట్స్ అమ్ముకునే దేవా (శర్వానంద్) కొన్ని అనివార్య కారణాల వలన గ్యాంగ్స్టర్ గా మారతాడు. అసలు అతను గ్యాంగ్స్టర్ గా మారడానికి గల కారణాలు ఏంటి? ఆ తర్వాత ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ.

నటీనటులు: ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో శర్వానంద్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే శర్వానంద్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో ఒక నటుడిగా సత్తా చాటుతూనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ చాలా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా కళ్యాణి ప్రియదర్శన్ మరియు శర్వా కెమిస్ట్రీ ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. వారి ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. మురళి శర్మ ఈ సినిమాలో చాలా బాగా నటించారు. అజయ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ఆదర్శ్ బాలకృష్ణ కనిపించింది కాసేపు అయినప్పటికి నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం: దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా కోసం ఒక చక్కని కథను ఎంపిక చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం గ్యాంగ్స్టర్ ల చుట్టూ తిరిగే ఈ సినిమా కథలో ప్రేమ యాంగిల్ ని కూడా చాలా బాగా చూపించారు. ఎంత గ్యాంగ్ స్టార్ సినిమా అయినప్పటికీ కేవలం యాక్షన్ సన్నివేశాల మీద మాత్రమే కాకుండా కథ మరియు కథనం మీద కూడా దర్శకుడు సుధీర్ వర్మ చాలా బాగా కాన్సెంట్రేట్ చేసి సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. ప్రశాంత్ పిళ్ళై సినిమా కోసం అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రెండు మూడు పాటలు ప్రేక్షకులను మెప్పించగా సినిమాలో ప్రశాంత్ అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు: సినిమా అంతా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. కథ ప్రకారం కొంత భాగం 80స్ బ్యాక్ డ్రాప్ తో సాగగా మిగతా సినిమా ప్రజెంట్ లో సాగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 80 బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా లో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సినిమా లోని మొదటి హాఫ్ మొత్తం కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. రిఫ్రెషింగ్ అనిపించే లవ్ ట్రాక్ మరియు అద్భుతమైన డైలాగులు ఫస్ట్ హాఫ్ ని చాలా ఆసక్తికరంగా ముందుకు తీసుకు వెళతాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని అంశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించే లా అనిపిస్తాయి. అయినప్పటికీ శర్వానంద్ అద్భుతమైన నటన ప్రేక్షకులను దృష్టిని ఆకర్షిస్తుంది. శర్వానంద్, కథ, సంగీతం మరియు డైలాగులు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. చివరిగా ‘రణరంగం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -