Friday, April 19, 2024
- Advertisement -

హీరోయిన్‌కు ప‌బ్లిగ్గా ముద్దుపెట్టిన హీరో

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభ‌ట్ గ‌త కొంత‌కాలంగా హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమ‌లో ఉంద‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. వీరిద్ద‌రి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు కూడా త‌మ అంగీకారం తెలిపాయి. తాజాగా ఫిలింఫేర్ అవార్డుల వేడుకలు ముంబైలో ఘ‌నంగా జ‌రిగాయి. అలియాభట్, రణబీర్ కపూర్ త‌మ ప్రేమ‌ను వ్య‌క్త ప‌ర‌చ‌డానికి ఫిలింఫేర్‌ను వేదిక‌గా చేసుకున్నారు. . ‘రాజీ’ సినిమాకు గాను అలియా భ‌ట్‌కి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది.అవార్డు రావడానికి కారణమైన వారికి థాంక్స్ చెబుతూ… త‌న ల‌వ‌ర్ రణబీర్ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి చెబుతూ అతడికి ‘ఐలవ్యూ’ చె ప్పింది. దీంతో రణబీర్ కాస్త సిగ్గు పడుతూ ముఖానికి చేయి అడ్డుపెట్టుకొని మురిసిపోయాడు. ఆ త‌రువాత రణబీర్ కూడా స్టేజీ మీద‌కు వెళ్లి ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చోని మ‌రి అలియా భట్‌కు త‌న ప్రేమ‌ను తెలియ‌జేశాడు.

రణబీర్ అలా ప్ర‌పోజ్ చేయ‌డంతోనే అలియా అత‌నికి ఓ హాగ్‌తో పాటు ప‌బ్లిగ్గానే ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి పెళ్లి గురించి ర‌కర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఇటీవల అలియా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలియా భ‌ట్ తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌నుంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది అలియా భ‌ట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -