నాగ‌న్న‌, జిగేల్ రాణితో స్టెప్పులేస్తున్న ‘చిట్టిబాబు’

1830
Rangasthalam Ram Charan and Pooja Hegde Jigel Rani Song
Rangasthalam Ram Charan and Pooja Hegde Jigel Rani Song

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చరణ్, సమంత జోడీగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో రూపొందించిన ఈ సినిమా మార్చి 30వ తేదీని థియేట‌ర్‌లోకి వ‌స్తోంది. అయితే దానికి ముందుకు సినిమాలోని మూడు పాటలు ‘ఎంత సక్కగున్నావే’, ‘రంగ రంగస్థలాన’, ‘రంగమ్మ మంగమ్మ’ విడుద‌ల చేశారు. ఆ పాటలు మాస్‌తో పాటు అంద‌రి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఆ పాట‌ల‌తో పాటు మ‌రి రెండు పాట‌లు వ‌చ్చేశాయి.

ఇప్పుడు ‘ఆ గట్టునుంటావా నాగ‌న్న‌’ అంటూ నాగ‌న్న స్టెప్పులు వేస్తుండ‌గా ‘జిగేలు రాణి’ అంటూ పూజాహెగ్డేతో పాదం క‌లప‌డానికి చిట్టిబాబు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా మొత్తం ఐదు పాటలతో గురుఆవ‌రం (మార్చి 15)రోజు యూట్యూబ్‌లో జ్యూక్‌బాక్స్ విడుదల‌య్యింది. అయితే ఈ పాట‌ల‌తో పాటు ఇంకో పాట కూడా ఉందంట‌.

అయితే ఈ సినిమాలో ఆ ఆరో పాటను ఇప్పుడే విడుద‌ల చేయ‌డం లేదు. ప్రత్యేక గీతం కావ‌డంతో దాన్ని సినిమాలో ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంజాయ్ చేయాలనే ఆలోచ‌న‌తో ఆ పాట‌ను విడుద‌ల చేయ‌లేదు. మరి అంత ప్ర‌త్యేక‌మైన ఈ పాట మార్చి 30వ తేదీ నుంచి సినిమా థియేట‌ర్‌లో విని చూడాల్సిందే.రంగ‌స్థ‌లంలోని సినిమా పాటలన్నీ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

 

Loading...