Saturday, April 20, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోకు కాని పిల్ల‌ల‌ను క‌ను..!

- Advertisement -

బాలీవుడ్ మోస్ట్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే అంద‌రు చేప్పే పేరు స‌ల్మాన్ ఖాన్‌.50 సంవ‌త్స‌రాలు నిండిన ఇప్ప‌టికి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు సల్మాన్‌. ప‌లువురి హీరోయిన్ల‌తో ఎఫైర్స్ న‌డిపినప్ప‌టికి వాటిని పెళ్లి వ‌ర‌కు తీసుకు వెళ్ల‌లేదు. తాజాగా సల్మాన్ పెళ్లిపై కామెంట్ చేసింది హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ. బాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కెరీర్ ఆరంభంలో వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ తరువాత విబేధాల కారణంగా ఇద్దరూ విడిపోయినా.. మళ్లీ కలుసుకున్నారు.

సల్మాన్ సినిమాల్లో షారుఖ్, షారుఖ్ సినిమాల్లో సల్మాన్ కనిపించి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. అయితే వీరి మధ్య స్నేహం బంధుత్వంగా మారితే చూడాలని ఉందంటోంది సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. షారుఖ్ కుమారుడు అబ్ రామ్ తో సల్మాన్ కూతురికి పెళ్లి జరగాలని కోరుకుంటోంది. అసలు సల్మాన్ కి పెళ్లి కూడా కాకుండా రాణి ముఖర్జీ ఈ విధంగా కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి గురించి వదిలేసి, పిల్లల్ని కనేయ్ అంటూ సల్మాన్ కి సలహాలు ఇచ్చింది. మ‌రి రాణీ ముఖ‌ర్జీ ఇచ్చిన స‌ల‌హాను స‌ల్మాన్ పాటిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -