దీపికా – ర‌ణ‌వీర్‌ల హానీమూన్ ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..?

1903
Ranveer- deepika honeymoon postponed?
Ranveer- deepika honeymoon postponed?

బాలీవుడ్ లేటెస్ట్ క‌పూల్ దీపికా ర‌ణ‌వీర్‌లు ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ నెల 14వ తేదీన ఇట‌లీలో వీరి వివాహం జరిగింది.పెళ్లి త‌రువాత ఇండియాకు వ‌చ్చిన ఈ జంట‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.ఇక బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్‌లో ఇద్ద‌రు చూడ ముచ్చ‌ట‌గా ఉన్నారు.ఈ నెలాఖారున ముంబైలో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప్ర‌త్యేకంగా రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు.ఈ రిసెప్ష‌న్ త‌రువాత వీరు హానీమూన్‌కి వెళ్తార‌ని అంద‌రు భావించారు. అయితే ఈ రిసెప్ష‌న్ త‌రువాత ఎవ‌రి సినిమాల‌లో వారు బిజీ అవ‌నున్నార‌ని తెలుస్తుంది.

ర‌ణవీర్ సింగ్ ఇప్ప‌టికే సింబా సినిమా షూటింగ్‌లో పాల్గోన్నాడు.ఈ సినిమా తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ సినిమాకు రీమేక్‌.ఈ సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.తనవ‌ల్ల సినిమా ఆస‌ల్యం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో సింబా షూటింగ్‌కి వ‌చ్చాడ‌ట ర‌ణ‌వీర్‌.ఇక దీపిక కూడా పెళ్లి వ‌ల్ల సినిమాలకు దూరం అయింది.వెంట‌నే ఏదైన సినిమాలో న‌టించాలని అనుకుంటుంద‌ట దీపిక.దీనిని బ‌ట్టి చూస్తే వీరు ఇప్ప‌ట్లో హానీమూన్ వెళ్లే అవ‌కాశాలు లేవని అర్థం అవుతుంది.