Thursday, April 25, 2024
- Advertisement -

విజయ్ తో రొమాన్స్ చేసి చాలా తప్పు చేశా : రాశిఖన్నా

- Advertisement -

టాలీవుడ్ లో అందమైన బ్యూటూ రాశి ఖన్నాకు మంచి క్రేజ్ ఉంది. ఆమె కెరీర్ విషయంలో కాస్త చూసి ముందు అడుగు వెళ్తోంది. ప్లాప్స్ వస్తే కెరీర్ కి ప్రాబ్లమ్ అవుతుందని ఆమె నిదానంగా ముందుకు సాగుతోంది. అలాంటి రాశి ఖన్నా ’వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది.

అయితే రాశి ఆ సీన్స్ లో అలా కనిపించడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆమె అంత రిస్క్ చేసి ఆ పాత్ర చేసిన ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆమె నిరాశ చెందింది. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ఆమె మరింత నిరాశ పడింది.

తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తన పాత్ర గురించి రాశి ఖన్నా స్పందిస్తూ.. “ఆ సినిమాలో నేను ఆ పాత్రను చేసి వుండకూడదు. ఆ పాత్రను ఒప్పుకుని ఒక రకంగా పొరపాటు చేశాను. నేను చేసిన ఆ పాత్ర నా పేరెంట్స్ ను కూడా బాధపెట్టిందని గ్రహించాను. అలాంటి పాత్రలను చేయకూడదనీ, గ్లామర్ పరంగా హద్దులు దాటని పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను” అని రాశి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -