Friday, March 29, 2024
- Advertisement -

ర‌ష్మికి అభిమాని వింత ప్ర‌పోజ‌ల్…ఎలా రెస్పాండ్ అయ్యారంటె..?

- Advertisement -

సెల‌బ్రిటీల‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ‌. త‌మ అభిమాన న‌టుల‌కోసం ప్రాణాలు కూడా లెక్క‌చేయ‌రు. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత తారలపై ఫ్యాన్స్ అభిమానం చాలా తేలికగా బయటపడుతున్నది. కొందరూ ఏమీ ఆశించడకుండానే తమ నచ్చిన నటులను ఆరాధిస్తుంటారు. మరి కొందరు తమ ప్రేమను వ్యక్తీకరించి వారినుంచి ఏదో పొందాల‌ని ఆశిస్తుంటారు. అలాంటి అనుభ‌వ‌మే యాంక‌ర్ ర‌ష్మికి ఎదుర‌య్యింది.

బుల్లితెర, వెండితెర మీద రాణిస్తున్న రష్మీ గౌతమ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఒక అభిమాని ట్విట్ట‌ర్‌లో ఓ కోరిక కోరాడు. తన బర్త్ డే రోజున నీ నుంచి విషెస్ కావాలి అని ట్విట్టర్‌లో ఆమెకు ఓ మెసేజ్ పెట్టారు. అందుకు ఆమె స్పందించారు.

రష్మికి అభిమాని పెట్టిన సందేశం ఇదే.. రష్మి గారు.. మీకు శుభోదయం. నాదో చిన్న కోరిక. ఈ రోజు నా బర్త్ డే. మీ నుంచి నేను విషెస్ కోరుకొంటున్నాను. మీరు నా పేరును పేర్కొంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపండి. మీరు విషెస్ తెలియజేయకుంటే జీవితంలో ఈ రోజుకు అర్ధం ఉండదు. నా బర్త్ డే అసంపూర్తిగానే గడచిపోతుంది. థ్యాంక్యూ మామ్ అంటూ మెసేజ్ పెట్టారు.

నాకు నీ విషెస్ కావాలి

అభిమాని కోరికకు ర‌ష్మి స్పందించారు. కానీ అభిమాని పేరు చెప్పకుండా హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పారు. అభిమాని పేరుతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఉంటే బాగుండేదేమో అనే వాదన సోషల్ మీడియాలో వినిపించింది. కాని అభిమానికి రష్మి విషెస్ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -