సుధీర్ నేను ఫ్రెండ్స్ కూడా కాదు : రష్మీ గౌతమ్

1293
rashmi gautam about relationship with sudigali sudheer
rashmi gautam about relationship with sudigali sudheer

బుల్లితెరపై జంటగా కనిపిస్తూ.. తమ మధ్య ఏదో ఉందన్న అనుమానం కలిగించేలా తమ కెమిస్ట్రీతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు సుడిగాలి సుధీర్, రష్మీ. వీరిద్దరు ఎప్పటి నుంచో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకల వార్తలు వచ్చాయి. వీరికి ఏర్పడ్డ క్రేజ్ తో షోలు కూడా బానే వాడుకున్నాయి.

వీరిద్దరి జంటపైనే ఆధారపడి షోలు నడుస్తున్నాయంటే వీరి క్రేజ్ ఎంత పీక్స్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఢీ షోతో వీరిద్దరి జంటకు మరింత పాపులార్టీ వచ్చింది. ఈ షోలో డ్యాన్సుల సంగతేమో గానీ, వీరిద్దరి మధ్య కామెడీ, లవ్ ట్రాకే ఎక్కువగా ఉంటుంది. జనాలు కూడా వాటిని చూడటానికి ఇష్టపడుతున్నారు. మధ్య మధ్యలో వీరిద్దరు చేసే హంగామా, డ్యాన్సులు, స్కిట్స్ బాగానే వైరల్ అవుతుంటాయి. సంక్రాంతి, దీపావళి అంటూ ప్రత్యేకంగా చేసే ఈవెంట్లలో వీరిద్దరు కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ ఉంటారు. నిజంగా పెళ్లి చేసుకుంటే కూడా అంతగా జీవించరేమో అన్నట్టుగా బుల్లితెరపై కనిపిస్తారు వీరిద్దరు.

ఇలా ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులకు నిజంగానే వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం కలుగుతుంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు నోరు విప్పారు. కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే తామిద్దరం అలా నటిస్తామని వివరణ ఇచ్చారు. కానీ రూమార్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా రష్మీ మాట్లాడుతూ.. తామిద్దరం నటీనటులం, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి స్క్రిప్ట్‌గా అనుగుణంగా నటిస్తుంటామని చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో తామిద్దరం కనీసం మంచి స్నేహితులం కూడా కాదని తెలిపింది. కానీ హాయ్ అంటే హాయ్ అనే ఓ డీసెంట్ రిలేషన్ షిప్ అని తెలిపింది.

Loading...