Thursday, April 25, 2024
- Advertisement -

అందరు చూస్తుండగానే రష్మీ, సుధీర్ల రొమాన్స్..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్, కమెడియన్ సుడిగాలి సుధీర్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కామెడీ చేయడంలో.. కెమెస్ట్రీ పండించడంలో అదరగొడుతారు. అందుకే వీరిద్దరు మధ్య లవ్ ఉందని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంటాయి. కాకపోతే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వీరిద్దరు పదే పదే చెబుతూ వస్తున్నారు.

అయితే స్టేజ్ పై వాళ్లు చేసే రొమాన్స్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోతారు. అంతా రొమాంటిక్ గా అదరగొడుతారు. ఇక ఈ జంట ఢీ చాంపియన్స్ షో కి యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో డాన్స్ లకంటే వీరిద్దరి రొమాన్స్ కోసమే ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా మరోసారి రష్మీ, సుధీర్ జంట స్టేజ్ పై అందరి ముందు రొమాంటిక్ గా ఓ పాటకు డాన్స్ వేస్తూ రెచ్చిపోయారు. ఢీ షోకి సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది.

ఈ ప్రోమోలో సుధీర్, రష్మీ లు ’ఉండిపోరాదే’ సాంగ్ కు డాన్స్ చేస్తూ అందరు షాక్ అయ్యేలా చేశారు. ఈ సాంగ్ లో డాన్స్ చేస్తూ.. రష్మీని రొమాంటిక్ గా తిప్పాడు సుధీర్. ఆ తర్వాత ఒకర్ని ఒకరు రొమాంటిక్ గా హత్తుకుంటూ జడ్జిలు చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -