నిజంగా రష్మీ గ్రేట్.. ఏ సెలబ్రిటీ చేయని ఆలోచన చేసింది..!

950
rashmi gautam on road to feed dogs
rashmi gautam on road to feed dogs

ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి గజగజ వణికిపోతుంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితి ఉంది. మన దేశంలో కూడా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ పరిస్థితుల్లో మూగ జీవులను పట్టించుకునే వారు లేకుండా పోయింది.

అయితే కరోనా కారణంగా మూగజీవులను నడి రోడ్డుపై వదిలేశారు చాలా మంది. లాక్ డౌన్ కారణంగా జనం ఇంట్లోనే ఉండటంతో మూగజీవులకు ఆహారం దొరక్కుండా అయింది. అయితే బుల్లితెరపై మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీకి మూగజీవులంటే మక్కువ ఎక్కువ. నిత్యం వాటి కోసం, వాటి పరిరక్షణ కోసం పరితపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ వాటి గురించే పోస్ట్ చేస్తూ ఉంటుంది. మూగ జీవాలకు లాక్ డౌన్ కారణంగా ఆహారం అందడం లేదని.. స్వచ్చంద సంస్థతో రష్మీ కలిసి ముందడుగు వేసింది.

మూగజీవాలకు ఆహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవ్వరైనా సరే ఆహారం లేదని ట్వీట్ చేస్తే చాలు వారికి అందేలా చేస్తోంది రష్మీ. తాజాగా రష్మీ బకెట్ పట్టుకుని రంగంలోకి దిగింది. మూతికి మాస్క్, చేతికి గ్లౌవ్స్ పెట్టుకుని వీధి కుక్కలకు ప్రేమగా ఆహారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Loading...