Thursday, April 25, 2024
- Advertisement -

రష్మిక తీరు ఎవరికీ అర్ధం కావడం లేదు

- Advertisement -

చలో సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన భామ రష్మిక మందన్న. కన్నడ లో కిరిక్ పార్టీ సినిమా తో తెరంగేట్రం చేసి పెద్ద విజయం సాధించి, ఆపై తెలుగు పరిశ్రమ లో కాలు మోపింది. తెలుగు లో సినిమాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి రష్మిక వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనూహ్యంగా గీత గోవిందం చిత్రం అవకాశం రావడం, ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అవ్వడం, తన పాత్ర కి కూడా పేరు రావడం చకచకా జరిగిపోయాయి. అప్పుడప్పుడే ఇండస్ట్రీ కి వస్తున్న హీరోయిన్లు రష్మిక రేంజ్ కి రావాలంటే చాలా కష్టపడాలి. అందరితో టచ్ లో ఉంటూ, పార్టీలు అటెండ్ అవుతూ,పార్టీలు ఇస్తూ, హాట్ హాట్ ఫోటో షూట్లు అటెండ్ అవుతూ సోషల్ మీడియా లో కొత్త ఫోటోలు పెడుతూ నానా హంగామా సృష్టించాలి.

కానీ రష్మిక ఇవేమి లేకుండా నే స్టార్డం సొంతం చేసుకుంది. అయితే కన్నడ అభిమానులు మాత్రం రష్మిక తెలుగు కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని ఆమెని తిర్రి పోస్తున్నా ఆమె మాత్రం రెండు పరిశ్రమలని బాలెన్స్ చేస్తున్న విషయాన్నీ ఒకటికి రెండు సార్లు చెప్తుంది.

అయితే రష్మిక మాత్రం తనకి సినిమా రిలీజులు లేని టైం లో కొత్త కొత్త ఫోటో షూట్స్ చేసి ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. ఇదేదో రిలీజ్ ఉన్న టైం లో చేస్తే కాస్త క్రేజ్ వస్తుంది కదా అంటే రష్మిక మాత్రం తన వ్యూహం తనదే అన్నట్టు ఉంది. ఇంత చేస్తున్నా ఆమెకు మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

https://www.instagram.com/p/ByuKotsAC52/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -