వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

1095
Raveena Comments on Nepotism
Raveena Comments on Nepotism

హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణించడంతో.. ఇండస్ట్రీలో నెపోటిజం పై అనే చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సుశాంత్ మృతికి నెపోటిజం కూడా ఒక కారణమని ఇప్పటికే చాలా మంది సెలబ్రీటీలు చెప్పారు. అయితే బాలీవుడ్ లో దాగి ఉన్న చీకటి కోణాలను ఒక్కొటి బయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన దారుణమైన ఘటన గురించి.. తన పట్ల కొందరు వ్యవహరించిన విధానం గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రముఖ ప్రసార మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రవీనా నెపోటిజం – ఫేవరిటిజం చాలా ఎక్కువ అని పేర్కొంది. రవీనా మాట్లాడుతూ.. తన కుటుంబంకు చెందినవారికే అవకాశాలు దక్కేలా చేయడం.. వారినే ఎంకరేజ్ చేయడం బాలీవుడ్ లో జరుగుతుందని.. అంతేకాకుండా హీరోయిన్లతో హీరోలు చాలా దారుణంగా బీహేవ్ చేస్తారని.. సినిమా షూటింగ్ మొదలు అవుతుందనే కొద్ది గంటల ముందు కుడా హీరోయిన్లను తీసివేయడం జరుగుతుందని చెప్పింది. బాలీవుడ్ హీరోలు నాకు పొగరు అహంకారం ఎక్కువని ప్రచారం చేసారు.. వారి బెడ్ రూమ్ కి వెళ్లడానికి నేను నిరాకరించడం వల్లే నాకు వ్యతిరేకంగా అలాంటి దుష్ప్రచారం చేశారు.

తమ గర్ల్ ఫ్రెండ్స్ మరియు వారికి పేవర్ గా ఉండే జర్నలిస్టులను ఉపయోగించుకొని హీరోయిన్లను దెబ్బ తీస్తారు అని పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. కొందరు మహిళా జర్నలిస్టులు వారి చెప్పినట్లు చేయడం షాకింగ్ గా అనిపించదని.. వారు నాపై చెత్త రాతలు రాసి హీరోయిన్ గా ఛాన్సుల్ రాకుండా చేయాలని దుష్ప్రచారం చేశారని రవీనా తెలిపారు. అయితే నేను ఆ రాతలను అసలు పట్టించుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోయాను. బాలీవుడ్ లో తడి గుడ్డతో గొంతులు కోసే రాజకీయాలు ఎక్కువగా జరుగుతాయని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

వందల కోట్లు వద్దని.. మాములు అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశీ..!

wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

Loading...