Thursday, March 28, 2024
- Advertisement -

రవి బాబు ‘ఆవిరి’ చిత్ర టీజర్ రివ్యూ

- Advertisement -

డిఫరెంట్ సినిమాలు చేయడంలో ముందుండే రవి బాబు ఈ మధ్యనే ‘అదుగో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. తాజాగా ఇప్పుడు రవిబాబు ‘ఆవిరి’ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నేహా చౌహాన్,శ్రీముక్త, భరణి శంకర్,ముఖ్తార్ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బాబు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా ఇవాళ సినిమా టీజర్ విడుదలైంది.

‘అవును’ సిరీస్ లాగానే ‘ఆవిరి’ కూడా హారర్ చిత్రం అని తెలుస్తోంది. రాజకుమార్ మరియు అతని కుటుంబంతో ఉన్న ఇంట్లో ఒక ఆత్మ కూడా ఉంది, దాని వల్ల ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేదే కథ అని టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రవిబాబు మళ్ళీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -