Friday, April 26, 2024
- Advertisement -

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

- Advertisement -

మాస్ రాజ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. శృతి హసన్ కథానాయిక.. గోపీచంద్ మలినేని ఈ సినిమా కి దర్శకుడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడి సినిమా గా ‘క్రాక్’ శేరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని రెండు మూడు సార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను దర్శకుడు కొట్టి పారేశాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేసేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. సినిమా ఖచ్చింగా థియేటర్ లోనే వస్తుంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందంటూ దర్శకుడు హామీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా రవితేజ మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నాడు..

నిజానికి మాస్ రాజా రవితేజ గత చిత్రం డిస్కో రాజా చిత్రం ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమా పై భారీ అంచనాలున్నాయి. మాస్ మహారాజ రవితేజ గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారనే వాదన రోజు రోజు కి ఎక్కువయిపోతున్న నేపథ్యంలో అయన సినిమా లు వరుసగా పరాజయం పాలవడం అయన ఫాన్స్ ని కలవరపెడుతున్నాయి.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమా లపై కొంత ఆసక్తి నెలకొంది.. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ను ఒప్పుకున్నాడు.. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా, నేను లోకల్ వంటి సినిమాలతో హిట్ కొట్టిన త్రినాధ రావు నక్కిన తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.. అయితే ఆ సినిమా కి ఇది కొంత టైం పట్టేలా ఉంది.. రమేష్ వర్మ సినిమా తర్వాత మరో దర్శకుడి తో సినిమా ఓకే చేశాడు రవితేజ.. యా తర్వాత వక్కంతం వంశీ లైన్ లో ఉన్నాడు.. దాంతో మరికొంత కలం నక్కిన వెయిట్ చేయక తప్పట్లేదు.. మరి వేరే హీరో తో వెళ్దామా అంటే హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. ప్రతి హీరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టేసుకుని వున్నారు. ఇలాంటి టైమ్ లో సినిమా సెట్ కావాలంటే చాలా అంటే చాలా అదృష్టం వుండాలి. మరి నక్కిన ఏం చేశారో చూడాలి..

ఆ హీరో ముద్దు పెట్టాలను చూశాడు : ఈషా రెబ్బా

విజయ్ తోనే మళ్ళీ మురుగదాస్.. ఏంటి బాసు ఇది..?

ఈ విజయ్ సినిమా వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందా..?

రామ్ కి రెడ్ ఇంత బాడ్ నేమ్ తెస్తుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -