Friday, March 29, 2024
- Advertisement -

డిస్కో రాజా: రవితేజ లుక్ అదిరింది

- Advertisement -

ఈ మధ్యనే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’ అనే సినిమా త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. నభ నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిషోర్ మరియు తాన్యా హోప్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ పోస్టర్లలో రవితేజ విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. రవితేజ లుక్ ఈ సినిమాలో హైలెట్ కాబోతోందని ఈ సినిమా పోస్టర్స్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ఎస్ ఆర్ టి మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -