Friday, March 29, 2024
- Advertisement -

హీరో రవితేజ కూతుర్ని చుశారా ?

- Advertisement -

మాములుగా సినిమాలతో బిజీగా ఉండే మన స్టార్స్ కి తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం అసలు ఉండదు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లింది. ఇంటికే పరిమితం అవుతున్న సెలెబ్రిటీలు వారివారి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేస్తున్నారు. మాస్ మహారాజ్ రవి తేజ ఈ క్వారెంటైన్ సమయాన్ని తన పిల్లలతో సరదాగా గడపడానికి కేటాయించారు.

రవితేజ తన కొడుకు కూతురితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ బాగా వైరల్ అవుతున్నాయి. అవి చూసినవారు.. మాస్ రాజాకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని షాక్ అవుతున్నారు. 2000లో రవితేజ, కళ్యాణి ని పెళ్ళిచేకున్నారు.అప్పటికి రవితేజ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం 2002లో రిలీజ్ అయింది. అదే ఏడాది ఇడియట్, ఖడ్గం వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

ఈ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రవితేజ-కళ్యాణిలకు మొదటి సంతానంగా 2003లో అమ్మాయి మోక్షద పుట్టింది. ఇక కొడుకు మహాధాన్ 2010లో జన్మించాడు. మహాధాన్ 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇటీవలే డిస్కో రాజా చిత్రంతో ప్లాప్ ని చూసిన రవితేజ.. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలని గోపీచంద్ మలినేనితో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -