Thursday, April 25, 2024
- Advertisement -

క్రాక్ ఎక్కిస్తున్న రవితేజ లుక్..హిట్ ట్రాక్ లోకి వచ్చేనా..?

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారనే వాదన రోజు రోజు కి ఎక్కువయిపోతున్న నేపథ్యంలో అయన సినిమా లు వరుసగా పరాజయం పాలవడం అయన ఫాన్స్ ని కలవరపెడుతున్నాయి.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ ఉస్కో అనడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..

రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి సినిమాలను చేసిన గోపీచంద్ మలినేని తో ఈ సరి మాస్ రాజ సినిమా ను అనౌన్సు చేశాడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడి సినిమా గా క్రాక్ శేరావేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని రెండు మూడు సార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను దర్శకుడు కొట్టి పారేశాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేసేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. సినిమా ఖచ్చింగా థియేటర్ లోనే వస్తుంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందంటూ దర్శకుడు హామీ ఇస్తున్నాడు.

ఇక ఈ సినిమానుంచి ఇటీవలే ఓ లుక్ రిలీజ్ కాగ యా లుక్ లో సినిమా ఎలా ఉంటుందో రవితేజ చెప్పకనే చప్పుడు..  పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న రవితేజ మీసం మెలేస్తు సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. రవితేజ లుక్ మరియు స్టైల్ కు అంతా ఫిదా అవుతున్నారు. అసలే హిట్ లేక అల్లాడిపోతున్న రవితేజ కి ఈ సినిమా ద్వార హిట్ కొడతాడా అనేది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -