Friday, April 26, 2024
- Advertisement -

’RDX లవ్’ మూవీ రివ్యూ..!

- Advertisement -

పాయల్ రాజ్ పుత్ పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది RX 100 సినిమా. ఈ చిత్రంలో ఆమె కనబరిచిన నటన చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక ఆమె తాజాగా నటించిన చిత్రం RDX లవ్. హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా పాయల్ హీరోయిన్ గా శంకర్ బాను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అలివేలు(పాయల్) ఎలాగైన సరే సీఎం దృష్టిలో పడాలని.. ఒక అపాయింట్మెంట్ కోసం ప్రభుత్వంకు సంబంధించిన కొన్ని పనులు చురుగ్గా చేస్తోంది. ఈ నేపథ్యంలో హీరో తేజు ద్వారా సీఎంను కలిసే ఛాన్స్ కల్పించుకుంటుంది. అయితే అలివేలు ఎవరు ? ఆమె సీఎం ను ఎందుకు కలవాలి అనుకుంటుంది ? తేజు పాత్రకు కథకు సంబంధం ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మొదట మాట్లాడుకోవాల్సింది పాయల్ గురించే. చిత్రంలో అవసరమేరకు అందచందాలు చూపిస్తూ అభిమానులను అలరించింది. గ్లామర్ గా మాత్రమే కాకుండా అద్భుతంగా నటించింది. ఎమోషన్ సీన్స్ లో అదరగొట్టింది. ఇక హీరో తేజు తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక విలన్ పాత్రలో ఆదిత్య మీనన్ చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, పాయల్, విలన్ మధ్య వచ్చే కబడ్డీ ఎపిసోడ్ బాగున్నాయి. ఓ మంచి సందేశం ఇద్దామనుకున్న దర్శకుడి ప్రయత్నం బాగుంది. చివరగా వచ్చే 20 నిమిషాలు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. రాధన్ అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

పస్ట్ ఆఫ్ సో సో గా నడుస్తుంది. స్క్రీన్ ప్లే వల్ల చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. కొన్ని చోట్ల పాయల్ ఎక్స్ పోజింగ్ ఎక్కువైనట్లు అనిపిస్తోంది. దర్శకుడు జాగ్రత్త తీసుకుని స్క్రీన్ ప్లే పై మరింత పట్టుగా తెరకెక్కిస్తే బాగుండేది. లాజిక్ లేని సీన్స్ కనిపిస్తాయి.

మొత్తంగా :

ఫైనల్ గా చూస్తే పాయల్ అందాలతో పాటు మంచి నటన తో సినిమాలో హైలైట్ అయింది. కథ బాగున్నా దాన్ని నడిపించే కథనంతో బోర్ కొట్టించాడు దర్శకుడు. పాయల్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -