Thursday, April 25, 2024
- Advertisement -

ట్రైలర్ రివ్యూ : ఆసక్తికరమైన ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న పాయల్

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్న పాయల్ రాజపుట్ ఇప్పుడు ‘ఆర్ డి ఎక్స్ లవ్’ అనే ఒక సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వి కె నరేష్, నాగినీడు, తేజస్ కంచర్ల, ఆదిత్యమీనన్, ఆమని, తులసి, ముమైత్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఏ చిత్ర ట్రైలర్ ని ఇవాళ విడుదల చేసారు దర్శకనిర్మాతలు. టీజర్ లో కేవలం బోల్డ్ సన్నివేశాలు చూపించినప్పటికీ, సినిమాలో కథ కూడా బలంగానే ఉంది అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమా మొత్తం ఒక చిన్న గ్రామం, అందులో ప్రజల చుట్టూ తిరుగుతుంది. అందులో పాయల్ ఒక పవర్ ఫుల్ లేడీ టైగర్ వంటి పాత్ర లో కనిపించనుంది. సికే సినిమాస్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -