Friday, April 19, 2024
- Advertisement -

అన్నయ్య పెళ్లికి అల్లుఅర్జున్ ఎందుకు రాలేదంటే..

- Advertisement -

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు బాబి తాజాగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాబీ ఇప్పుడు నీలా షా అనే ఒక్క యోగా ఇన్స్పెక్టర్ ను వివహమాడారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అల్లు బాబి పెళ్లి ఫోటోలలో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కనిపించారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే బన్నీ బదులుగా బన్నీ భార్య స్నేహ మాత్రం పెళ్లికి హాజరైంది.

మరి సొంత అన్నయ్య పెళ్ళికి అల్లుఅర్జున్ ఎందుకు రాలేదు అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు బన్నీ. అందుకే రాలేదట. ఇంతకుముందే షూటింగ్ కి ఒప్పుకోవడంతో, పైగా అదే రోజు చాలా మంది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అందరితో షూటింగ్ ఉండటంతో పెళ్లికి రాలేకపోయాడు బన్నీ. అయితే అదే రోజు రాత్రి బన్నీ పెళ్లికి హాజరయ్యారు అని సమాచారం అందుతుంది. కానీ బన్నీ ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. ఇక ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -