Thursday, March 28, 2024
- Advertisement -

ప్రకాష్ రాజ్ కోసం మహేష్ ఒక మెట్టు దిగాడా?

- Advertisement -

సరిలేరు నీకెవరు సినిమా షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయినా సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర వర్గాలు మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ సినిమా లో జగపతి బాబు స్థానం లో ఇప్పుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ విషయమై వచ్చిన పుకార్ల పై జగపతి బాబు, మరియు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే.

అయితే అసలు విషయానికి వస్తే ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కి ఇప్పుడు ఆర్థికంగా కష్టం గా ఉందిట. అందుకే ఆయన ఒక పెద్ద సినిమా లో చేస్తే తర్వాత మెల్లగా మిగిలిన సినిమాల లో సంపాదించుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చారట. ఆయన కి దగ్గర్లో కనిపించిన ఒకే ఒక చిత్రం సరిలేరు నీకెవరు. సినిమా నిర్మాత దిల్ రాజు దగ్గరకు వెళ్ళి అవకాశం అడుగగా, ఆయన తన చేతుల్లో ఏమి లేదు అని చెప్పారట.

వెంటనే ప్రకాష్ వెళ్ళి మహేష్ ని రిక్వెస్ట్ చేయగా, ప్రకాష్ మీద ఉన్న అభిమానం తో మహేష్ బాబు జగపతి బాబు ని పర్సనల్ గా ఒప్పించి తను బయటకు వచ్చే లా చేసి ఆ పాత్ర ని ప్రకాష్ కి ఇప్పించారట. జగపతి బాబు కి ఇష్టం లేకపోయినా ప్రకాష్ పరిస్థితి ని చూసి, మహేష్ ని నొప్పించకుండా ఉండాలనే ఉదేశ్యం తో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -