Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్ ఒక్కడికే ఫేక్ ఎలిమినేషన్ జరగడానికి కారణాలు ఇవే…

- Advertisement -

రాహుల్ సిప్లిగంజ్ మంచి మాస్ సాంగ్ లతో ఒక పాప్ సింగర్ గా జనాలలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. తన ఏ పాట రిలీజ్ చేసినా గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వస్తాయి అంత క్రేజ్ ఉంది రాహుల్ కి. అలానే ఆ పాటలతో తనకి వచ్చిన పేరుతోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు రాహుల్. అడుగుపెట్టిన వెంటనే అంత క్రేజ్ తనకి లేకపోయినా… పున్నుతో పులిహోర అంటూ, ఏ గేమ్ అయినా గివ్ అప్ అంటూ నెగిటివ్ గా బాగా ఫేమస్ అయ్యాడు.

తెలంగాణ పోరడు, మాటలు మస్త్ మంచిగా మాట్లాడతడు, పాటలు అబ్బో చంపేస్తాడు… ఇవన్ని కలగలసి ఉన్న రాహుల్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ పెరగడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. రాహుల్ కి అంత మంచి పేరు రావడానికి ఒక విధంగా శ్రీముఖి కూడా కారణమే. ఆవిడ తిట్లే రాహుల్ కి అభిమానులను పెంచి వారికి రాహుల్ ని దగ్గర చేసింది. రాహుల్ మాటలు అభిమానులకు అప్పుడప్పుడే వినిపించినా అవి మంచి చెప్పే మాటలే అవ్వడంతో నాగార్జున కూడా రాహుల్ ని మెచ్చుకున్నాడు. అలా అని రాహుల్ మంచి వాడేం కాదు మస్త్ గలీజ్ మాటలు కూడా అంటాడు. కానీ జనాల వెనక మాట్లాడడం రాదు రాహుల్ కి. వరుణ్, వితిక, పునర్నవి రాహుల్ బాగా ఆడుకుంటారు అది కూడా జనాలకు బాగా నచ్చింది.

ఒకటి రెండు వారాలు మినహాయించి మిగతా అన్ని వారాలు రాహుల్ నామినేషన్స్ లో ఉన్నాడు. కానీ సేవ్ అవుతూ వచ్చాడు. పునర్నవితో రాహుల్ కి సేవ్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు రాహుల్ చాలా ప్రాక్టకల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ మంచి గుణమే రాహుల్ బ్యాక్ వచ్చేలా చేసింది అనుకుంట. శనివారం రాహుల్ ఎలిమినేట్ అయ్యాక, మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళతావా అని అడిగితే వెళతా అన్నాడు వెంటనే నాగార్జున ఇది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పగానే రాహుల్ కి, రాహుల్ అభిమానులకు ఆనందానికి అవదుల్లేవ్.

ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలో రాహుల్ వాయిస్, వానలో రాహుల్ ఇంట్లోకి వస్తున్నప్పుడు వేసిన పాట, రాహుల్ డ్రెస్ అన్నీ అదిరిపోయాయి అంటూ జనాలు ప్రోమో కింద చేసిన కామెంట్స్ చూస్తుంటే రాహుల్ కి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అని తెలుస్తోంది. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ కారణం రాహుల్ కి వచ్చిన అతి ఎక్కువ ఓట్లే అని కొన్ని వర్గాల సమాచారం. బిగ్ బాస్ లో ఇలాంటి షాకులు సాదారణమే కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -