Saturday, April 20, 2024
- Advertisement -

టీనేజ్ లో అలాంటి సినిమాలు చూసాను అంటున్న హీరోయిన్

- Advertisement -

రెజీనా కాసాండ్రా తెలుగు సినిమా పరిశ్రమ లో ఎంతో కొంత క్రేజ్ ఉన్న హీరోయిన్. ఇప్పటికే తాను గ్లామరస్ పాత్ర చేస్తుంది అంటే పని గట్టుకుని మరీ థియేటర్ కి వెళ్లి వచ్చే అభిమానులు ఆమెకి ఉన్నారు. ఇటీవల కొంత సక్సెస్ శాతం తగ్గడం తో రెజీనా సినిమాలు సైన్ చేసే జోరు కూడా తగ్గించింది. గత వారం రోజులు గా రెజీనా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అనే వార్తలు ఎక్కువ అయిపోయాయి. కాకపోతే రెజీనా మాత్రం ఈ విషయమై ఇప్పటి వరకు తన స్పందన ని తెలియజేయలేదు. అయితే కొన్ని మీడియా సైట్లు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం రెజీనా ఇటీవలే తన టీనేజ్ జీవితం గురించి చెప్తూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేసిందట.

తాను టీనేజ్ లో ఉన్నప్పుడు అడల్ట్ సినిమాలు చూసాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. సాధారణం గా ఇంకా వేరే హీరోయిన్ ఎవరైనా అయితే ఈ విషయం చెప్పడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు కానీ రెజీనా మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా ఈ విషయాన్ని చెప్పేసింది. ఈ నెల లో విడుదల అయినా 7 సినిమా విఫలం అవడం తో రెజీనా పెద్దగా మళ్ళి మీడియా లో కనిపించలేదు. తన తదుపరి చిత్రం ఏంటి అనే క్లారిటీ కూడా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -