Friday, March 29, 2024
- Advertisement -

పెళ్ళి పీటలు ఎక్కనున్న రెజీనా కాసాండ్రా

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో హాట్ హీరోయిన్ల లో రెజీనా కాసాండ్రా ఒకరు. సుధీర్ బాబు సరసన ఎస్ఎంఎస్ సినిమా తో తెరంగేట్రం చేసి ఆ పై పలు యువ హీరోల పక్కన సినిమా అవకాశాలు కొట్టేసి అందరినీ ఇంప్రెస్ చేసింది ఈ హీరోయిన్. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇంట త్వరలో పెళ్ళి బాజాలు మోగనున్నాయని ఇండస్ట్రీ లో అంతా చర్చించుకుంటున్నారు. ఇటీవలే విడుదల అయినా 7 సినిమా ప్లాప్ అవడం తో రెజీనా నిరుత్సాహపడిందట. అయితే వెంటనే దాని నుండి బయటకి రావడానికి ఇక పర్సనల్ లైఫ్ సెట్ చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తుంది అని సమాచారం.

తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తి నే రెజీనా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే వరుడి పేరు, వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యం గా ఉంచారు.అతి త్వరలో రెజీనా నే స్వయంగా ఈ విషయం గురించి ఒక అధికారిక ప్రకటన చేస్తారు అని తెలుస్తుంది. ఇంతకు ముందు రెజీనా కి ఒక యువ హీరో తో అఫైర్ ఉంది అని చాలా సార్లు మీడియా కథనాలు రాసారు. కానీ హీరోయిన్ మాత్రం వాటిని కొట్టి పారేశారు.

ఇక ఎంగేజ్మెంట్ కి సంబందించిన డేట్ ని త్వరలో రెజీనా ప్రకటించే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ టాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -