Tuesday, April 23, 2024
- Advertisement -

లైవ్‌లో అభిమానికి క్లాస్ పీకిన రేణు దేశాయ్‌

- Advertisement -

సోష‌ల్ మీడియా ద్వారా సెల‌బ్రిటీలు అభిమానులతో డైరెక్ట్‌గానే మాట్లాడే అవ‌కాశం క‌లిగింది. అయితే దీనిని చెడుకు ఉప‌యోగించే వారి సంఖ్యే కాస్తా ఎక్కువుగా ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అత‌నికి విడాకులు ఇచ్చి వేరుగా జీవిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె రెండో పెళ్లికి కూడా రెడీ అయింది. దీనిపై ప‌వ‌న్ అభిమానులు ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. చాలా రోజులు త‌రువాత అభిమానుల‌తో లైవ్‌లో మాట్లాడింది రేణు దేశాయ్‌.

ఈ సంద‌ర్భంగా ఆమెకు కాబోయే భ‌ర్త గురించి అభిమానులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. కాబోయే భర్త పేరు చెప్పాలని ఓ అభిమాని కోరగా, అతని పేరును తాను చెప్పలేనని తెలిపింది. అతను సినీ, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తి కాదని, ఓ ఐటీ ప్రొఫెషనల్ అని అన్నారు. మ‌రో ఫ్యాన్ కాబోయే భర్తను ఎప్పుడెప్పుడు కలుస్తారు? అని ప్రశ్నించాడు. దీంతో అత‌నిపై కాస్తా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది రేణు దేశాయ్‌. ఇలా అడగటం మంచి ప‌ద్ద‌తి కాద‌ని అత‌నికి హిత‌వు ప‌లికింది.

ఇది మంచి సంస్కారం కాదని, వేరేవాళ్ల పర్సనల్ విషయాలు అడగకూడదని అన్నారు. ఎంత సెల‌బ్రిటీ అయిన‌ప్ప‌టికి వారికి కూడా కొంత వ్య‌క్తిగ‌తం ఉంటుంద‌ని గ్ర‌హించాల‌ని కోరింది. మీరు ఇలాంటి ప్ర‌శ్న‌లు అడిగితే ఎలా స‌మాధానాలు చెప్పాలి అని ఆ అభిమానికి చిన్న‌పాటి క్లాస్ పీకింది. పెళ్లి అయిన తరువాత అతని వివరాలు తెలుస్తాయని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -