పవన్ ఫ్యాన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రేణు దేశాయ్..!

3897
Renu Desai fires on netizens
Renu Desai fires on netizens

మరోసారి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వార్తల్లో నిలిచింది. పవన్ తో రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే “పవన్ కు సంబంధించి ఎటువంటి వార్తలు నా వద్దకు తేకండి. అఖీరా ని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. నన్ను వదిన అనొద్దు’ అంటూ రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెను ఉద్దేసిస్తూ ఏదో ఒక కామెంట్ చెయ్యడం. దానికి రేణూ మండిపడటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పిల్లలకు సంబంధించిన బర్త్ డే వంటి వేడుకలకి పవన్, రేణూ కలుస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రేణూ దేశాయ్… పవన్ కు సంబంధించి తన సోషల్ మీడియాలో ఓ రెండు పోస్ట్ లు పెట్టింది. దానికి ఓ నెటిజన్ బహుసా పవన్ అభిమాని అనుకుంట.. ‘ఈ రేణూ దేశాయ్ మళ్ళీ కెలుకుతుంది. ఇప్పుడు అవసరమా’ అంటూ పోస్ట్ చేసాడు. అది చూసిన రేణూ…”నాకు ఈ స్క్రీన్ షాట్ వచ్చింది. నా మెసేజెస్ లో. అవును నాకు అవసరం. #20yearsofbadri మీ ఇన్ఫర్మేషన్ కోసమే.

ఈ సినిమా గురించి చాలా మంది మరిచిపోతారు. ఇది నాకు చాలా చాలా స్పెషల్ మూవీ. అంత ద్వేషం ఎందుకు అన్నా. అసలే మనం వైరస్ వల్ల క్రైసిస్ లో ఉన్నాము. కొంచెం మంచి ఆలోచనలే పెట్టుకోండి అందరి కోసం. ఇంత కోపం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు” అంటూ బదులిస్తూ ఆ స్క్రీన్ షాట్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

Loading...