Thursday, April 25, 2024
- Advertisement -

లాయర్ సాబ్.. దిమ్మతిరిగేలా చేసిన రేణు దేశాయ్..!

- Advertisement -

పవన్ కళ్యాణ్, నటి రేణు దేశాయ్.. కొన్ని కారణాల చేత విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే రేణు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలు, ఆలోచనలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. సామాజిక అంశల గురించి కూడా మాట్లాడుతుంది. తాజాగా ఆమె కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.

అలాగే ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అదే టైంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని పింక్ రీమేక్ లాయిర్ సాబ్ లో మీరు నటిస్తున్నారా అని అడిగారు. అందుకు ఆమె స్పందిస్తూ అది రుమర్ అని తెలిపింది. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయోద్దని కోపడింది. ఇక లాయర్ సాబ్ విషయంకు వస్తే.. పవన్ ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మే 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలకపాత్రలో కనిపించనుందని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్నే ఇప్పుడు రేణు ఖండించారన్నమాట. తాను పవన్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -