Thursday, April 25, 2024
- Advertisement -

రెండో పెళ్లి గురించి..స్పందించిన పవన్ మాజీ భార్య రేణూదేశాయ్!

- Advertisement -

వివాహానికి ముందే కొంత కాలం సహజీవనం చేసి.. ఒక బాబు పుట్టిన తర్వాత పవన్ కల్యాణ్ రేణూదేశాయ్ ని వివాహంచేసుకొన్నాడు.

రాజకీయ విమర్శలను తలాలేకే పవన్ ఆమెను వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆమెతో డైవోర్స్ తీసుకొని మూడో పెళ్లి చేసుకొన్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతానికి అయితే రేణూదేశాయ్ ఒంటరిగా ఉంది.

పవన్ తో విడాకుల అనంతరం ఆమె అప్పుడప్పుడు వార్తల్లోకి కూడా వస్తోంది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి గురించి స్పందిచడం మరింత ఆసక్తికరంగా మారింది.

“మగాడు అయితే విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకోగలడు. పిల్లలు పుట్టి ఉన్నా భార్తయో తెగదెంపులు చేసుకొని ఎంచక్కా మరో మహిళను వివాహం చేసుకోగలడు. అయితే వివాహం అయ్యి..పిల్లలు పుట్టాకా విడాకులు తీసుకొన్న మహిళ పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఆమె మరో వివాహానికి మొగ్గు చూపడం అంత సులభం కాదు..” అంటూ వ్యాఖ్యానించింది రేణూదేశాయ్.  

మరి ఈ మాటలను బట్టి చూస్తే రేణూకు రెండో పెళ్లి ఉద్దేశం లేనట్టేనని అనుకోవాలి. విడాకుల అనంతరం పవన్ మళ్లీ పెళ్లి చేసుకొని సెటిలైనా రేణూ మాత్రం మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడం లేదనే అనుకోవాల్సి వస్తోంది. ఆమె తన పిల్లలతో జీవితం గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -