Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్జీవీ ’క్లైమాక్స్‌’లో మియా మల్కోవా.. రెచ్చిపోయింది..!

- Advertisement -

రామ్ గోపాల వర్మ ఏం చేసి అది ఒక సంచలనంగా మారుతోంది. సెన్షేషన్ కావాలంటే ఏం చేయాలో వర్మకి బాగా తెలుసు. అందుకే నలుగురికి నచ్చిన దారిలో వెళ్లకుండా తనకు సొంత ఓ దారి క్రియేట్ చేసుకుని అందులో వెళ్తుంటాడు. ఎంతటివారికైన సమాధానం చెప్పగల వర్మ నిత్యం వివాదాల్లో తలదూర్చడం లేదా కొత్త వివాదాలను క్రియేట్ చేయడం ఆయనకే చెల్లింది.

ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనాకు వణికిపోతుంటే.. వర్మ మాత్రం పోర్న్ స్టార్ మియా మాల్కోవాను దింపాడు. గతంలో ఆమెతో జీఎస్టీ అంటూ నానా రచ్చ చేసిన వర్మ.. తాజాగా ఆమెతో ‘క్లైమాక్స్‌’ అనే చిత్రంను తెరకెక్కించాడు. ఈ క్రమంలో ఆర్జీవి చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. ‘కరోనా ఇచ్చిన శాపం, లాక్ డౌన్ ఆశీర్వాదంతో నేను, మియా మాల్కోవా కలిసి క్లైమాక్స్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే’ అంటూ ఓ బాంబ్ పేల్చాడు.

మియా మాల్కోవాకు సీన్స్‌ను వివరిస్తూ ఉన్న ఫోటోలనుషేర్ చేస్తూ ఇక టీజర్ రాబోతోందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ వచ్చాడు. మొత్తానికి టీజర్ రిలీజ్ చేసి ఈ వేసవిలో అందరిలోనూ వేడిని పుట్టించాడు. క్లైమాక్స్ చిత్రం థ్రిల్లర్ జానర్‌కు చెందింది. అయినా సరే వర్మ స్టైల్, మియా మాల్కోవా అందాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. మరోసారి నగ్నంగా నటించింది. అందుకు సంబంధించిన టీజర్ మీరు చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -