Thursday, April 25, 2024
- Advertisement -

కడప పై అలా.. పవన్ పై ఇలా

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి కోటరీ అంటే రాముకు ముందునుంచి ఎందుకో కోపం.అది ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.దీనికి వెనుక మతలబు వర్మ చెప్పడు, పవన్ కూడా ప్రతి స్పందించడు.మెగా కాపౌండ్ ను కెలికితే వచ్చే పబ్లిసిటీ కాస్త ఎక్కువ కాబట్టి వర్మ ఆ టీమ్ ను టార్గెట్ చేస్తుంటాడు.ఐతే తాజాగా రాము కడప పై వెబ్ సిరీస్ రూపొందించి తన యై ట్యూబ్ ఛానల్లో పెట్టాడు.దీని గురించి మార్కెట్లో విపరీతమైన చర్చ నడుస్తుంది. కడప అంటే కేవలం అక్కడి రెడ్ల గురించే ఎందుకు ప్రస్థావించావు.ఇంకా చాలా జాతులు ఉంటాయి కదా .వాటిని ఎందుకు టచ్ చేయలేదు. రెడ్లంటే ఇలాగే ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు. ఇక్కడ సామాజిక నేపద్యం నీకేం తెలుసు అంటూ కొశ్చన్స్ మీద కొశ్చన్స్ పడిపోతున్నాయి.టివి డిబేట్ లకు సిద్ధమవుతున్న వేళ అనవసరం కడప బ్యాచ్ తన మీద పడుతుందనుకున్నాడో ఏమో…తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తడం షురూ చేసాడు.

దానిలో భాగంగా భిన్న అంశాలపై పవన్ కున్న దూరదృష్టి చూసి ఆశ్చర్యపోయానంటూ ఓ పోస్ట్ పెట్టాడు. పవన్ కల్యాణ్ తాజా ప్రసంగాన్ని ఇప్పుడే తాను చూశానని, భిన్న అంశాలపై ఆయనకున్న దూరదృష్టిని చూసి ఆశ్చర్యపోయానని వర్మ చెబుతున్నాడు. ‘పవన్ కల్యాణ్ కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ప్రారంభించిన వర్మ తన మార్కు వ్యాఖ్యలు చేశారు. ‘ గతం, భవిష్యత్ పై అతనికి ఉన్న స్పష్టత అమోఘం. అతని చుట్టూ వ్యాపించి ఉన్న వదంతులను ఎంతో నిజాయతీగా ఖండించారు. ఈ క్రమంలో ఆయా వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ, అతని ఆలోచనలు, భావాలను సిగ్గుపడకుండా వ్యక్తం చేయడం, ఆయన కొండంత ఐక్యతకు దృష్టాంతంగా చెప్పొచ్చు. అన్నింటి కంటే ముఖ్యంగా, నాకోసం నేను చెబుతున్న విషయమేంటంటే.. మాట్లాడేముందు పవన్ ఆలోచిస్తాడు, ఈ పాఠాన్ని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే, నాకొక స్టుపిడ్ హ్యాబిట్ ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను. అన్ని అంశాలకు సంబంధించి ఎంతో దూరదృష్టి ఉన్న పవన్ కల్యాణ్ కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కల్యాణ్ నిలిచిపోతారని నేను భావిస్తున్నా’ అని వర్మ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఒకే రోజు రెండు కోణాలు చూపించిన రామును ఏవిధంగా అర్ధం చేసుకోవాలో నెటిజన్లకు అర్ధం కాలేదు. ఇప్పటికే ఈయనగారి దగ్గరనుంచి ఎన్నో షేడ్స్ చూసిన జనాలు ఈ మల్టిపుల్ యాంగిల్స్ కు అలవాటు పడిపోయి..పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశారు.

https://www.youtube.com/watch?v=6UJjBrBiGbA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -