Thursday, April 25, 2024
- Advertisement -

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వ‌చ్చేస్తోంది…!

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా తెర‌కెక్కిస్తున్న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఈ సినిమాను ఎన్టీఆర్ జీవితంలోకి ఆయ‌న రెండో భార్య ల‌క్ష్మి పార్వ‌తి ఎంట్రీ ఇచ్చిన దగ్గ‌ర నుంచి తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సాంగ్స్‌, ట్రైల‌ర్‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని ఫిక్స్ చేశాడు వ‌ర్మ‌.

బాల‌య్య మ‌హ‌నాయ‌కుడు విడుద‌ల త‌రువాతే త‌న సినిమాను విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వ‌ర్మ‌, చెప్పిన‌ట్లుగానే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను మ‌హ‌నాయ‌కుడు విడుద‌ల త‌రువాతే విడుద‌ల చేస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. ఈ సినిమాతో ఎన్టీఆర్ జీవితంలో ఎవ్వ‌రికి తెలియ‌ని కోణాలు తెలియ‌జేస్తానని తెలిపాడు. మ‌రి ఇంత వివాస్ప‌ద‌మైన ఈ సినిమాను ఏపీలో విడుద‌ల అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -