సోష‌ల్ మీడియాలో లీక్ అయిన వ‌ర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

237
Rgv lakshmi's ntr scene leaked in social media
Rgv lakshmi's ntr scene leaked in social media

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. తెలుగు తెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవితంలోని చివ‌రి రోజుల‌ను సినిమాలుగా తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే సినిమాకు చాలామంచి బ‌జ్ వ‌చ్చింది. విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌,ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ఈ నెల 22న సినిమా విడుద‌ల కానుంది. ఈలోపే సినిమాలోకి కీల‌క స‌న్నివేశం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయింది.

వైస్రాయ్ హోట‌ల్ వ‌ద్ద ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు చెప్పులు వేయించే సీన్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితోనో చెవిలో ఏదో చెప్పడం ,వెంటనే ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ గా చూపించారు. ఈ సంద‌ర్భంలోనే ‘దగా దగా’ అనే పాట కూడా మొదలవుతుంది. అయితే ఆన్‌లైన్‌లో పెట్టిన కొద్ది గంట‌ల్లోనే డిలీట్ చేశారు. అయితే వ‌ర్మ‌నే కావ‌ల‌ని లీక్ చేశారా.. లేక ఎవ‌రో తెలియ‌క చేశారో మాత్రం తెలియాల్సి ఉంది.