Saturday, April 20, 2024
- Advertisement -

దిశ ఘటనపై రామ్ గోపాల్ వర్మ సినిమా..!

- Advertisement -

‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. తెలంగాణకు చెందిన వెటర్నరీ వైద్యురాలిని నలుగురు వ్యక్తులు మద్యం తాగించి దారుణంగా రేప్ చేసి సజీవదహనం చేశారు. తెలంగాణ పోలీసులు దిశ నిందితులను ఎన్‍కౌంటర్ చేశారు.

అయితే సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఘటనను తన తర్వాతి సినిమా కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు. ఈ విషయంను వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నా తర్వాతి సినిమా పేరు ‘దిశ’. దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు.

ఒకప్పటి రేపిస్ట్‌ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్‌లు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నాను. నిర్భయను రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి పరిస్థితి తమకు ఎదురుకాకూడదని దిశను రేపిస్ట్‌లు కాల్చి చంపేశారు’’ అని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -