‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

1503
rgv powerstar movie review and rating
rgv powerstar movie review and rating

రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసిన ఓ పెద్ద సంచలనమే అవుతుంది. అయితే ఈ కరోనా, లాక్ డౌన్ టైంలో ఏ సినిమా షూటింగ్ కూడా జరగలేదు. కానీ వర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో కూడా సినిమా షూట్స్ చేస్తూ రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలను తీసి రిలీజ్ చేశాడు. తాజాగా పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేశాడు. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్‌తో వివాదం లేపిన వర్మ.. కావాల్సినంత హైప్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ : ప్రవన్ కళ్యాణ్ అనే మూవీ స్టార్ హీరో.. మనసేన పార్టీని స్థాపించి ఎలక్షన్లో ఘోరపరజయం చూస్తాడు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు రావడంతో.. చాలా కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్ తో ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు. ఓదార్చుతారు.. తిడతారు. చివరగా తన తదుపరి కార్యచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధన చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ మూవీ చూడాల్సిందే.

విష్లేషణ : పవర్ స్టార్ మూవీ ప్రవన్ కళ్యాణ్ చూట్టు తిరిగుతూ ఉంటుంది. మిగిత పాత్రలు అలా వచ్చి పోతుంటాయి అంతే. సినిమాలో అన్ని పాత్రలు నిజ జీవితంలో కొందర్ని పోలీ ఉంటాయి. వాళ్లు మాట్లాడే విధానం కానీ.. పోలికలు కానీ అలా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో టీఎస్, గుండ్ల రమేష్, కత్తి, ఆయన అన్నయ్య, బాబు, రష్యన్ భార్య వస్తారు. క్లైమాక్స్ లో వీరాభిమాని వచ్చి కనువిప్పు కలిగిస్తాడు. ఆయా పాత్రల్లో అందరు చాలా బాగా నటించారు. ఇక గడ్డి తింటావా సాంగ్ సెటైరికల్‌గా బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రాఫీ బానే ఉంది. అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో తీయడంతో నిర్మాణానికి కూడా ఎక్కువగా ఖర్చుకానట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంకు వస్తే.. నిడివి, ప్రవన్ కళ్యాణ్ నటన అని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. కథ, కథనం. పవర్ స్టార్ మూవీని వర్మ తన ఊహకు ఏది వస్తే అది తీసినట్లు అర్దం అవుతుంది. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకున్నాడు.. బానే తీశాడు.

నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరయైన పవన్ కళ్యాణ్..!

వంశీ యకసిరి ‘మే16’ ఫస్ట్ లుక్

ముద్దులతో హీరోయిన్ ను వదిలని ‘డర్టీ హరి’..!

నిఖిల్ ఎవరో నాకు తెలియదు : వర్మ షాకింగ్ కామెంట్స్

Loading...