Friday, April 26, 2024
- Advertisement -

వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ను… కదిపాడు కదా

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రోజుకో అప్డేట్ పెడుతూ సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేస్తున్నాడు. ఈసినిమాలో బాబు పాత్రను, వర్మ మిత్రుడు జేడీ చేయబోతున్నాడనే న్యూస్ గుప్పు మనడంతో రియాక్ట్ అయిన వర్మ… అలాంటిదేం లేదని, చంద్రబాబు పాత్రను ఎవరు చేస్తారో తెలీదు కానీ జెడి చక్రవర్తి మాత్రం చేయడంలేదని తెగేసి చెప్పేశాడు.

ఎట్ ది సేమ్ టైమ్ తన స్టైల్లో బాంబ్ కూడా పేల్చాడు. ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయ జీవితాల్లో ముఖ్య ఘట్టంగా చెప్పుకునే వైస్రాయ్ హోటల్ ఉదంతాన్ని ఇక్కడ రాము డిస్కస్ చేస్తూ… అసలు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏం చేయలేదో, ఏం చేశారో నాకు నిజంగా తెలీదంటా పూర్తిగా కన్ఫ్యూజన్ కు గురిచేసే మరో స్పైసీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దీంతో అసలు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పదలచుకుంటున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు.

అతను తెలిసే ఇలా చెబుతున్నాడా లేక సరదాకు నా సినిమాలో వైస్రాయ్ హోటల్ లాంటి కీలక ఎపిసోడ్స్ కూడా ఉంటాయని చెబుతున్నాడా అనేదే ఎవ్వరికీ అర్ధం కాకుండా ఉంది. ఇంతలా జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ తాను అవుతూ… బాబును ఇంకెంతలా ఇబ్బందులు పెడతాడో రానున్న రోజుల్లో తన సినిమా వార్తలతో చూపించబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -