‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో లక్ష్మి పార్వ‌తి,చంద్ర‌బాబుగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

695
Rgv reveals lakshmi parvathi and chandrababu roles
Rgv reveals lakshmi parvathi and chandrababu roles

వివాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ సినిమా తీసిన దానిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో బాగా తెలుసు. దీనికి ఆయ‌న గ‌తంలో తీసిని సినిమాలే సాక్ష్యం. తాజాగా వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’. దివంగ‌త న‌టుడు, మాజీ సీఎ ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మి పార్వాతి జీవిత కథ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్నాడు వ‌ర్మ‌. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలను వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు.మ‌రోప‌క్క బాల‌కృష్ణ న‌టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ రాని క్రేజ్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వ‌స్తోంది. పాట‌ల రూపంలోనే సినిమాకు విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్నాడు వ‌ర్మ‌.

తాజాగా త‌న సినిమాలోని ఒక్కో క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేస్తున్నాడు. సినిమాలో ల‌క్ష్మి పార్వ‌తి క్యారెక్ట‌ర్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో బ‌య‌ట‌పెట్టాడు. ఈ సినిమాలో ల‌క్ష్మి పార్వ‌తిగా కన్నడ నటి యజ్ఞా శెట్టి న‌టిస్తోంది. యజ్ఞా శెట్టికి క‌న్న‌డ‌లో మంచి న‌టిగా పేరు ఉంది. ఈమెను ల‌క్ష్మి పార్వ‌తి క్యారెక్ట‌ర్‌లో ఎంచుకోవ‌డంలోనే వ‌ర్మ విజ‌యం సాధించాడ‌ని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్ర‌ను ఎవ‌రు చేస్తున్నారో కూడా బ‌య‌ట‌పెట్టాడు వ‌ర్మ‌. చంద్ర‌బాబు పాత్రలో శ్రీతేజ్ న‌టిస్తున్నాడు. శ్రీతేజ్‌ గ‌తంలో వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వంగ‌వీటి సినిమాలో దేవినేని నేహ్రూగా న‌టించాడు. తాజాగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో వైఎస్ఆర్‌గా కూడా న‌టించాడు శ్రీతేజ్. అలాగే ఎన్టీఆర్ పాత్రను చేసేవారి ‘ఫోటోలను కూడా బయటపెట్టాల్సిందిగా వర్మను అభిమానులు కోరుతున్నారు.