Thursday, April 25, 2024
- Advertisement -

‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’లో ఐరెన్ మ్యాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

- Advertisement -

మార్వెల్ సిరీస్‌ నుంచి వ‌చ్చిన లాస్ట్ పార్ట్ అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌. ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. భాష‌తో ప‌ని లేకుండా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్ సూప‌ర్ హిట్ అయింది. అవెంజర్స్ నుంచి వ‌స్తున్న లాస్ట్ పార్టే ఇదే కావ‌డంతో సినిమా చూడ‌టానికి చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు. థానోస్‌ను చంప‌డానికి సూప‌ర్ హీరోలు ఏం చేశార‌ని ఈ సినిమాలో చూపించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ఈ సినిమా 8000 కోట్లు సాధించిద‌ని తెలుస్తోంది. ఇండియాలో కూడా ఈ సినిమా మంచి కలెక్ష‌న్లు సాధించింది. హాలీవుడ్ నుంచి వ‌చ్చిన సినిమాల్లో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాఅవెంజర్స్‌ ఎండ్‌గేమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాలో ఐరెన్ మ్యాన్ పాత్రలో న‌టించిన రాబర్ట్‌ డౌనీ జూనియర్ పారితోష‌కం గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్ కోసం క‌ళ్లు చెదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం రాబర్ట్‌ డౌనీ జూనియర్ ఏకంగా 524 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే ఈ మొత్తం పారితోష‌కం రూపంలో కాకుండా , సినిమా లాభాల్లో వ‌చ్చే వాటా ద్వారా తీసుకున్నాడ‌ట రాబర్ట్‌. హాలీవుడ్‌లో 500 కోట్ల పారితోష‌కం తీసుకున్న అతికొద్ది మందిలో రాబర్ట్ కూడా చేరిపోయాడు. ఇప్పుడు రాబర్ట్ పారితోష‌కం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -