పవన్ గుండుపై రోజా వ్యాఖ్యలు.. లైక్ చేసిన పూనమ్..!

990
Roja comment on Pawan Kalyan gundu
Roja comment on Pawan Kalyan gundu

అప్పట్లో పరిటాల రవి అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. అయితే ఆయన హీరో పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారనే ప్రచారం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి.. తాను తమ్ముడు మూవీ షూటింగ్ కోసం గుండు కొట్టించానని.. తాను పరిటాల రవిని ఒక్కసారి కూడా కలవలేదని స్పష్టం చేశాడు.

అయినప్పటికి ఆ వార్తలు ఆగలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు గుండు కొట్టించింది టీడీపీ అని.. 2014లో కూడా పవన్ కు గుండు కొట్టించిందని.. 2019లో ఎన్నికల్లో కూడా పవన్ కు గుండును టీడీపీయే కొట్టిస్తుందని సెటైర్లు వేసింది. రోజా గతంలో పవన్ గుండు గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఆ వీడియోను చూసి హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా లైక్ చేయడం గమనార్హం. ఇదివరకు పవన్ కళ్యాణ్ పై పరుష విమర్శలు చేసి.. అతడిని వెనకేసుకొచ్చి ప్రేమను కోపాన్ని చూపించిన పూనమ్ కౌర్.. తాజాగా పవన్ కు గుండు కొట్టించే వ్యాఖ్యలను లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప లో వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

పవన్ కళ్యాణ్ ప్రేమ చాలా గొప్పది….. పవన్‌పై పూనం కౌర్ లవ్ ట్వీట్…. రచ్చ…

పూనమ్ కౌర్ టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా?

Loading...