Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్‍ఆర్‍ఆర్ : ఎన్టీఆర్ హీరోయిన్ గురించి సీక్రెట్స్..!

- Advertisement -

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలు గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.

రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కోమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకోసం హాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ స్టార్స్ ని కూడా రంగంలోకి దింపాడు దర్శకుడు రాజమౌళి. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ వెతుకుతున్న ఆర్.ఆర్.ఆర్ టీంకి.. ఎట్టకేలకు హీరోయిన్ దొరికింది. ఆమె పేరు ఒలివియా మోరిస్. ఈ చిత్రంలో ఈమె జెన్నిఫర్ అనే పాత్ర పోషిస్తోంది.

ఈమె ‘రోయల్ వెల్ష్ కాలేజ్ అఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా’ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. అందులోనే చిన్న పిల్లలకు నటనలో శిక్షణ ఇస్తుంది కూడా..! ఈమెకు టీవీ మరియు సినిమా రంగం పై చాలా ఇంట్రెస్ట్ అంట. అయితే ఒలివియా మోరిస్ సోషల్ మీడియాలో పెద్ద ఫెమిలియర్ కాదు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ సరసన ఈమె హీరోయిన్ గా నటిస్తుంది అని తెలిసిన వెంటనే… నెటిజన్లు ఈమె ప్రొఫైల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

లండన్ కు చెందిన ఈ భామ.. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చేసిన పాత్ర అందరినీ ఆకట్టుకునేలా రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒలివియా మోరిస్ కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూడండి.

olivia-8
olivia-4
olivia-9

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -