Saturday, April 20, 2024
- Advertisement -

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

- Advertisement -

‘ఆర్.ఆర్.ఆర్’ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా టీజర్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చరణ్ చెప్పినట్లుగానే ‘భీమ్ ఫర్ రామరాజు’ కి రిటర్న్ గిఫ్ట్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ తారక్ కి అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చాడు.

”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి దైర్యం చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్” అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేశాడు. చరణ్ ను నిప్పుల్లో చూపించిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు. భీమ్ గా తారక్ ను చూపించే ప్రతి ఫ్రేమ్ లో నీటికి ప్రతీకగా ఉండే షాట్స్ ఎక్కువగా కనిపించాయి.

సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్ కి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. చరణ్ అందించిన వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని చూస్తే ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని ఔరా అనక మానడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను ఇటీవలే మళ్లీ ప్రారంభించారు. మీరు కూడా ఆ టీజర్ ను చూడండి..!

నాని కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిండా..

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

రానా అరణ్య పెద్ద స్క్రీన్ లోనే..

బన్నీ ఫాన్స్ లో ఆందోళన మొదలవుతుందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -