Wednesday, April 24, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కు జోడీగా అమెరిక‌న్ బ్యూటీ…

- Advertisement -

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్ర‌తీష్టాత్మ‌క భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ లో న‌టిస్తున్నారు. అయితే సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎట్ట‌కేల‌కు ఓ ఫారిన్‌ భామ దొరికింది.

రాజమౌళిదర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలు. ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది. ఎన్టీఆర్ జోడిగా మొదటడైసీ ఎడ్గర్‌ జోన్స్ అనుకున్నారు. ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పు కుంది.దీంతో ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అనేక పేర్లు తెరమీదకు వచ్చినా కథ ప్రకారం విదేశీ భామనే కావాలని రాజమౌళి పట్టుబడ్డాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు జోడీగా ఇప్పుడు అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్ ను రాజ‌మౌళి ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. రాజమౌళి ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -