‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్..!

290
rrr movie poster
rrr movie poster

ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేశారు ఆర్ఆర్ఆర్ సినిమా బృందం. ‘ఎదురు చూపులు ముగిశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేసినట్లుగానే సరిగ్గా ఆ టైంకే ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘రౌద్రం.. రుధిరం.. రణం’ టైటిల్ ను పెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌ హీరోలు రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ టైటిల్, మోషన్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మీరు కూడా ఆ మోషన్ పోస్టర్ చూసేయండి..!

Loading...