Thursday, April 25, 2024
- Advertisement -

“రూలర్” మూవీ రివ్యూ

- Advertisement -

బాలకృష్ణ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సోనాల్ చౌహాన్ మరియు నివేదికలు హీరోయిన్లుగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం “రూలర్”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అనుకోని పరిస్థితులో జయసుధ బాలయ్యను చేరదీసి తన వ్యాపార లావాదేవీలకు అండగా ఉండాలని పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా మార్చేస్తుంది. అయితే అతనికి ఓ గతం ఉందని ఆమెకు తెలియదు. అయితే జయసుధకు ఓ చేదు ఘటన ఉత్తర ప్రదేశ్ లో ఎదురవుతుంది. దాంతో అక్కడకు బాలయ్య వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది ? ప్రకాష్ రాజ్ మరియు భూమికలకు బాలయ్యకు ఉన్న సంబంధం ఏమిటి? ఇక్కడ పోలీస్ రోల్ లో కనిపించే బాలయ్య ఎవరు? అతని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : టోనీ స్టార్క్ లుక్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలయ్య.. సిల్వర్ స్క్రీన్ పై చాలా స్టైలీష్ గా కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్.. పంచ్ డైలాగ్స్ ఇలా బాలయ్య నుంచి ఏం కోరుకుంటామో అవన్ని జనంను ఆకర్షిస్తాయి. యాక్షన్ సీన్స్ సహా ఇంటర్వెల్ బ్లాక్ లోని కొన్ని సీన్స్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రైతులకు సంబంధించిన ఎపిసోడ్స్ బాగున్న్నాయి. హీరోయిన్స్ మిగిత నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. అలానే సినిమాటోగ్రాఫీ, నిర్మణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ వరకు బానే తీసుకొచ్చిన దర్శకుడు..సెకండాఫ్ కు వచ్చేసరికి రొటీన్ ట్విస్ట్ తో ప్రేక్షకులను నిరశపరిచాడు. ఆసక్తికరంగా ఉండని రొటీన్ ట్విస్ట్, రొటిన్ కథనం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. ఫస్ట్ హాఫ్ లోలానే సెకండాఫ్ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేసారు కానీ కథ లో దమ్ము లేకుంటే ఏం చేసిన జనాలు ఎంజాయ్ చేయలేరు. యాక్షన్ సీన్స్ వల్ల వైలెన్స్ కూడా కాస్త ఎక్కువయ్యినట్టే అనిపిస్తుంది. బాలయ్య పోలీస్ లుక్ చాలా నిరాశ పరుస్తుంది. అసలు ఆ లుక్ ఎందుకు ట్రై చేసారో వారికే తెలియాలి. ఇక హీరోయిన్స్ కి కూడా పెద్దగా స్కోప్ లేని పాత్రలే చేశారు. సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

మొత్తంగా :
ఇక మొత్తంగా చూస్తే.. బాలయ్య నుంచి ఆయన అభిమానులు కోరుకునే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ కథ రొటీన్ కావడం వల్ల మిగిత ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు. సో బాలయ్య సినిమాలను ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -