Wednesday, April 24, 2024
- Advertisement -

రూలర్ టీజర్ టాక్.. ఇది గమనించారా ?

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమా రూలర్. ఈ సినిమాకి కెయస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాలయ్య సరసన ఈ చిత్రంలో సొనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా చేస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ అయింది.

టీజర్ ఆరంభంలోనే.. “ధర్మ మా ఊరి గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు”అంటూ హీరో ఎంట్రీ వచ్చిన ఇంట్రో బాగుంది. ఇక బాలయ్య తనదైన శైలిలో రౌడిలను తుక్కు తుక్కుగా కొడుతూ.. ఫుల్ యాక్షన్ మూడ్ లో ఉన్నారు. ఇక ఈ టీజర్లో కూడా బాలయ్య పవర్ ఫుల్ పంచ్ ఉంది. “ఒంటి మీద ఖాకి యూనిఫాం ఉంటేనే బోన్లో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బైటకొచ్చిన సింహంలా ఆగను..ఇక వేటే” అంటూ చిటికెలు వేస్తూ పోలీసు యూనిఫాంలో బాలయ్య గర్జించారు.

ఇక టీజర్ ఎలా ఉంది అంటే.. బాలకృష్ణ అభిమానులు ఏ అంశాలు అయితే కోరుకుంటారో అవన్ని ఉన్నాయి. ఇంటెన్స్ సీన్స్.. ఫైట్లు.. రొమాన్స్.. కామెడీ.. ఇలా అన్నీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తారాగణం భారీగా ఉంది. అటు ప్రకాష్ రాజ్.. భూమిక నుంచి ఇటు ధన్ రాజ్ వరకూ చాలా మంది సినీయర్ నటీనటులు ఉన్నారు. ఇక సినిమా స్టోరీ తెలియకుండా టీజర్ ను కట్ చేశారు. ట్రైలర్ వస్తే సినిమా కథ ఏంటో అర్దం అయిపోతుంది. ఇక ఈ టీజర్ లో బాలయ్య రెండు గెటప్ లో కనిపించారు. మీరు కూడా టీజర్ ను చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -