మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్ త్రిష‌?

2496
Rumors halchal in heroine trisha marriage
Rumors halchal in heroine trisha marriage

స్టార్ హీరోయిన్ త్రిష మళ్లీ ప్రేమ‌లో ప‌డింద‌ని గ‌త కొన్ని రోజులుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది త్రిష‌.ఒక వ్యాపార వేత్తతో ప్రేమ‌లో ప‌డిన త్రిష పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.కారణాలు చెప్ప‌లేదు కాని స‌డ‌న్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని సినిమాలు తీయ‌డం మొద‌లుపెట్టింది.మళ్లీ ఇన్నాళ్లుకు త్రిష పెళ్లి గురించి వార్త‌లు వ‌స్తున్నాయి.బెంగ‌ళూరుకి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌లో త్రిష‌లో ప్రేమ‌లో ఉంద‌ని ,త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని తెలుస్తుంది.అయితే ఈ పెళ్లి వార్త‌ల‌పై త్రిష స్పందించింది.

ఇలాంటి వార్త‌ల‌ను అభిమానులు ఎవ‌రు న‌మ్మోద్ద‌ని తెలిపింది. “ప్రస్తుతం నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. ఈ మధ్య కాలంలో నా గురించి అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి .. అందులో ఇదొకటి. నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే .. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను. ఈ విషయాన్ని దాచాలని కూడా నేను అనుకోవడంలేదు. ఇక పెళ్లి తరువాత నేను సినిమాలు చేస్తానా .. మానేస్తానా అనేది అప్పుడు తీసుకోవలసిన నిర్ణయం. అందువలన అనవసరమైన ప్రచారాలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి” అని చెప్పుకొచ్చింది.