Wednesday, April 24, 2024
- Advertisement -

సమంతా పై పుట్టుకొస్తున్న బోలెడు పుకార్లు

- Advertisement -

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని ‘మజిలీ’, ‘ఓహ్ బేబీ’ వంటి వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే సమంత మీద ఇప్పుడు బోలెడు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంతకుముందు సమంత సినిమాలో నుంచి బ్రేక్ తీసుకొని పిల్లలకోసం ప్లాన్ చేయడానికి సిద్ధం అవుతోందని వార్తలు వినిపించాయి. కానీ కొద్ది రోజుల్లోనే సమంత షూటింగులతో బిజీగా ఉండడంతో ఆ వార్తలు ఆవిరైపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆక్రోబాటిక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేస్తున్న సమంత ఇప్పుడు ఒక యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో నటించబోతోందని తెలుస్తోంది.

డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ నిర్మించనుందట. అయితే మరో వైపు సమంత హీరోయిన్ సెంట్రింగ్ సినిమాలు చేసి బోర్ కొట్టేసిందని ఒక రెండు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు తాజాగా వచ్చిన వార్తలు వింటే, అందులో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్య పాత్ర పోషించ బోతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సామ్ గెస్ట్ పాత్రలో కనిపించనుందట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -