‘ఆర్ఎక్స్’ 100 ద‌ర్శ‌కుడు కుటుంబంలో విషాదం

410
Rx 100 director father died
Rx 100 director father died

ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజయ్‌భూపతి ఇంట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. అజయ్‌భూపతి తండ్రి వేగేశ్న రామరాజు(54) బుధవారం అర్థ‌రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.వేగేశ్న రామరాజుకి కొడుకు,కూతురు ఉన్నారు.కొడుకు అజయ్‌భూపతి దర్శ‌కుడిగా సెటిల్ అవ్వ‌గా, కుమార్తె అమెరికాలో స్థిరపడిన‌ట్లు తెలుస్తుంది.

అజయ్‌భూపతి తండ్రి మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఆయ‌న‌ను పరామర్శించారు.ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ డైరెక్టర్‌ అజయ్‌భూపతి.ప్ర‌స్తుతం ఆయ‌న త‌న రెండో సినిమాను మొద‌లెట్టే ప‌నిలో ప‌డ్డాడు.ఈలోపే ఆయ‌న తండ్రి మ‌ర‌ణించారు.