Friday, March 29, 2024
- Advertisement -

మళ్ళీ హాట్ సన్నివేశాలలో పాయల్ రాజపుత్

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో అందాలను ఆరబోసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ‘ఆర్ డి ఎక్స్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ కొన్ని బోల్డ్ మరియు ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తోందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

వి కె నరేష్, తేజస్ కంచర్ల, నాగినీడు, ఆదిత్య మీనన్, ఆమనీ, తులసి, ఐశ్వర్య, ముమైత్ ఖాన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి కె సినిమాస్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కాకుండా పాయల్ రాజ్ పుత్ ‘డిస్కో రాజా’ మరియు ‘వెంకీ మామా’ సినిమాలతో కూడా బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -