Thursday, April 25, 2024
- Advertisement -

విల‌న్‌గా మారుతున్న మ‌రో యంగ్ హీరో

- Advertisement -

హీరోలుగా చేసిన వారు చాలామంది ఈ మ‌ధ్య విల‌న్లుగా న‌టిస్తున్నారు. ఇలా హీరోలుగా చేసి విల‌న్‌గా రాణిస్తున్న వారిలో ప్ర‌ముఖంగా జ‌గ‌ప‌తి బాబు పేరు చెప్పుకోవాలి. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తి బాబుకు ఫ్యామిలీ లేడిస్ చాలామంది అభిమానులు ఉండేవారు. అలాంటి జ‌గ‌ప‌తి బాబుకు హీరోగా అవ‌కాశాలు లేకపోవ‌డంతో విల‌న్‌గా మారాడు. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టించాడు. ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందాయి.

ఈ సినిమా తరువాత జ‌గ‌ప‌తి బాబు వెను తిరిగి చూసుకునే ప‌ని లేకుండా పోయింది. తాజాగా మ‌రో యంగ్ హీరో విల‌న్‌గా మారుతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోగా న‌టించిన కార్తికేయ విల‌న్‌గా న‌టించ‌డానికి రెడీ అయ్యాడ‌ని స‌మాచారం. న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమాలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు కార్తికేయ‌. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్ కోసం కార్తికేయ‌ను సంప్ర‌దించార‌ట విక్ర‌మ్ కుమార్‌.

క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట కార్తికేయ‌. హీరోతో స‌మానంగా విల‌న్ రోల్ ఉండ‌టంతోనే కార్తికేయ ఈ సినిమా ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొదలుకానుంది. నాని ప్రస్తుతం జెర్సీ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే విక్ర‌మ్ కుమార్ సినిమా మొదలుపెడ‌తాడు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -